The ODI series against New Zealand in 2010 was one that saw Gambhir's captaincy shine through and India whitewash the visitors 5-0 after winning the final ODI at Chennai. It was the ideal start for Gambhir who made the most of the absence of Dhoni by cementing his legacy as one of the best temporary captains
#GautamGambhir
#CricketFormats
#GautamGambhirRetirement
#indiancricketteam
#KolkataKnightRiders
#ipl
బ్యాట్స్‌మెన్‌గానే కాదు కెప్టెన్‌గా కూడా గౌతం గంభీర్ వంద శాతం విజయాన్ని సాధించాడు. టీమిండియాలో బ్యాట్స్‌మన్‌గా రాణించిన గంభీర్ కొన్ని సందర్భాల్లో కెప్టెన్‌గా వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను అందుకున్న గౌతీ కెప్టెన్సీలో వంద శాతం విజయవంతమైయ్యాడు. ఈ క్రమంలో 2010లో న్యూజిలాండ్‌తో ఆడిన వన్డే మ్యాచ్‌లో భారత్ పర్యాటక జట్టును 5-0తేడాతో చిత్తుగా ఓడించింది. ఫైనల్ మ్యాచ్‌ను చెన్నైలో గెలిచింది. ధోనీ గైర్హాజరీతో జట్టును విజయవంతంగా నడిపించడంలో తొలిసారి విజయాన్ని అందుకున్నాడు గంభీర్. సంవత్సరం తర్వాత అదే వేదికగా వెస్టిండీస్‌తో ఆడిన మ్యాచ్‌లో మరోసారి ఆడి గెలిచి సత్తా చాటుకున్నాడు. ఇలా గంభీర్ 6వన్డేలకు నాయకత్వం వహించి ఆరింటిలోనూ విజయం సాధించాడు. ఇలా ఒకే ఒక్క టీమిండియా కెప్టెన్ ఆడిన అన్నీ మ్యాచ్‌లను వంద శాతం విజయాలతో ముగించాడు.